ATP: కంబదూర్ మండలంలోని పేరూరు రోడ్డులో ఉన్న పశువుల ఆసుపత్రి ప్రహరీ గోడకు రంధ్రం పడింది. దీంతో రాత్రి వేళ ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంబదూర్ నుంచి పేరూరు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టే క్రమంలో 6 నెలల కిందట ప్రహరీ గోడకు జేసీబీ తగలడంతో గండి పడినట్లు అక్కడి సిబ్బంది అంటున్నారు.