KNR: ఎల్ఎండీ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువల ద్వారా ఈ ఏడాది యాసంగి పంటలకు డిసెంబర్ 31న ఉదయం 11 గంటలకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఇంజనీర్ పి. రమేష్ తెలిపారు. కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వారాబందీ పద్ధతిలో నీటి సరఫరా జరుగుతుంది. 8 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని ఆయన వివరించారు.