మీ దగ్గర చిరిగిన నోట్లు ఉంటే కంగారుపడాల్సిన అవసరం లేదు. RBI రూల్స్ ప్రకారం రూ.10 కంటే ఎక్కువ విలువైన నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. నోటు మురికిగా మారినా, కొద్దిగా చిరిగినా కొత్తవి ఇస్తారు. గాంధీ ఫొటో, RBI గవర్నర్ సంతకం, వాటర్ మార్క్ మిస్ అయితే నోటులో కొంత విలువను చెల్లిస్తారు. పూర్తిగా కాలిపోయినా, దెబ్బతిన్నా RBI ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.