KRNL: ఆలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. TDP పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి నివాసం వద్ద గ్రీవెన్స్ స్వీకరణ జరుగుతుందని వైకుంఠం జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించుకోవాలని ఆమె వెల్లడించారు.