KMM: పాలేరు నియోజకవర్గంలో ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 10:30 గంటలకు కూసుమంచి మండలంలోని గంగబండతండాలో 100 పడకల ఆసుపత్రి స్థల పరిశీలన, అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 3:30 గంటల నుంచి ఖమ్మం రూరల్ మండలం పరిధిలో సమీకృత కార్యాలయ భవనం శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.