PDPL: ప్రపంచమంతా జరుపుకునే పండగ క్రిస్మస్ అని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌కుమార్ అన్నారు. ఎన్టీపీసీ, గౌతమీనగర్ ఏరియాలోని చర్చిల్లో ఈ రోజు జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.