GNTR: పొన్నూరు శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ సాక్షి భావనారాయణ స్వామివారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. గురువారం శ్రీ గోదాదేవి అమ్మవారు స్వర్ణపురి పట్టణ పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.