ASF: చైనా మాంజా అత్యంత ప్రాణాంతకమని జిల్లా ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. వాహనదారులకు ఇది తీవ్ర ప్రమాదమని తెలిపారు. చైనీస్ మాంజా అమ్మకం, రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని, ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని వివరించారు. ఎవరైనా జిల్లాలో మాంజా అమ్మితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.