NZB: రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల విజేతగా నిజామాబాద్ జట్టు నిలిచిందని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగ మోహన్ తెలిపారు. ఈ టోర్నమెంట్లో TGSWRS ధర్మారం విద్యార్థిని మాదరి ప్రణయ ప్రత్యేక బహుమతిని అందుకుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.