SRCL: రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు వేములవాడకు చెందిన విద్యార్థినిలు కే.శ్రీనిధి, ఆర్.రిషిక ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ చిన్నమనేని చందు తెలిపారు. కరీంనగర్లో ఈనెల 25 నుంచి 28 వరకు జరిగే 72వ కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థినిలను అభినందించారు.