E.G: డిసెంబర్ 8 నుంచి 15 వరకు దేవరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పరమేశ్ బయోటెక్ కార్మికుల ఆటల పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా శాప్ డైరెక్టర్ పేరం రవీంద్ర గురువారం విజేతలను అభినందించి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బయోటెక్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఆనంద్ స్వరూప్, జనరల్ మేనేజర్ శివప్రసాద్, శేషారావు తదితరులు పాల్గొన్నారు.