కృష్ణ: భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జన్మదిన వేడుకలు కోడూరు బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలు చేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ప్రభుత్వం వైద్యశాలలో రోగులకు పండ్లని పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.