NGKL: పోల్కంపల్లిలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్యకు నూతన సర్పంచ్ అంకునారమ్మ పరిష్కారం చూపారు. గ్రామంలో నీటి లభ్యత ఉన్నప్పటికీ మోటారు లేక నిరుపయోగంగా ఉన్న బోరుబావికి ఇవాళ నూతన విద్యుత్ మోటారు అమర్చారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజల అవసరాల దృష్ట్యా దశలవారీగా గ్రామ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.