E.G: రాజమండ్రి పార్లమెంటరీ TDP కార్యదర్శిగా నిడదవోలుకు చెందిన దాసం బాపన్న నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్టానం నుంచి నియామక ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా ఆయన గురువారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.