TG: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. సిట్ చీఫ్ సజ్జనార్‌తో సిట్ బృందం కీలక సమావేశం నిర్వహించింది. ఈ హైలెవల్ భేటీలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసులో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి? ఎవరిని విచారించాలి? అనే అంశాలపై అధికారుల మధ్య సీరియస్ చర్చ జరిగినట్లు సమాచారం.