ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని ఎంపీ చెరువు గ్రామంలో గురువారం సాయంత్రం కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది నిందితులను అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి 6 కోళ్లు, 4 ద్విచక్ర వాహనాలు, రూ.8,100 నగదును జప్తు చేసినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. మండలంలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.