MBNR: ప్రేమ,శాంతి,క్షమ,త్యాగం లాంటి మహోన్నత విలువలను ప్రపంచానికి అందించిన కరుణామయుడు ఏసుక్రీస్తు అని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. మర్లు ఆగాపే చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. క్రీస్తూ సందేశాలను ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టి సమాజంలో సోదరా భావం, మానవత్వాన్ని మరింత పెంపొందించాలని పిలుపునిచ్చారు.