VZM: బొబ్బిలి పట్టణంలోని ఉన్న రాణి మల్లమ్మ దేవి పార్క్ లో ఆట పరికరాలు పాడైపోయాయని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యాయామం చేసుకునే ఐరన్ పోల్స్ తుప్పు పట్టే స్థితిలో ఉన్నాయని చెబుతున్నారు. తుప్పు పట్టిన ఐరన్ భాగాల వల్ల పిల్లలకు చేతులు గుచ్చుకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.