RR: చేవెళ్ల మీర్జగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన చిన్నారులకు గ్రామస్తులు చేయూతనిచ్చారు. హాజీపూర్ గ్రామంలో పామేన గ్రామస్తులు చిన్నారులకు రూ.76,500 ఆర్థిక సాయం అందజేశారు. చిన్నారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దావల్ గారి గోపాల్ రెడ్డి, గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.