వాజ్‌పేయి శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వాజ్‌పేయి జీవితం దేశానికే అంకితమని, ఆయన విలువలకు కట్టుబడిన నేత అని కొనియాడారు. ఇక సంసద్ ఖేల్ మహోత్సవ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జనవరి 20 నుంచి ఫిబ్రవరి 3 వరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో క్రీడా పోటీలు ఉంటాయని వెల్లడించారు.