KRNL: క్రిస్మస్ పండుగ సందర్భంగా TDP సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ.. క్రిస్మస్ శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమను చాటే పండుగ అని పేర్కొన్నారు.