RR: షాద్నగర్ పట్టణంలో కమ్మ సమైక్య వేదిక డివిజన్ కమిటీని నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వర రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కమ్మ సమైక్యవేదిక కమ్మ జాతికి పేరు తెచ్చేలా ముందుకు సాగాలన్నారు. నూతన కమిటీకి తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కమ్మ జాతి ఔన్నత్యం, ఐక్యత కోసం కష్టపడాలన్నారు.