WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని మైసంపల్లె గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వేముల ఇంద్రదేవ్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో భాగంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అలాగే గ్రామానికి అవసరమైన మౌళిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానని వెల్లడించారు.