TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డెక్కన్ కిచెన్ ఓనర్ నందకుమార్ విచారణకు హాజరయ్యారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన నందకుమార్‌ను.. ఇప్పుడు ఆ అంశంపైనే సిట్ (SIT) గట్టిగా ప్రశ్నిస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంతో ఎమ్మెల్యేల ఎర కేసుకు ఉన్న లింకులపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.