NZB: నగరంలోని శంభు లింగేశ్వర దేవస్థానంలో బుధవారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. సుమారు రూ.6,000 విలువైన ఇత్తడి, రాగి గిన్నెలు, చెంబులను దుండగులు అపహరించారు. బుధవారం రాత్రి 7 గంటలకు విషయాన్ని గుర్తించిన ఆలయ సిబ్బంది, సీసీ ఫుటేజీ ఆధారంగా టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.