RR: షాద్‌నగర్ పట్టణంలోని నాగులపల్లి రోడ్డులో నివాస ప్రాంతాల మధ్య కొందరు విద్యుత్ వైర్లను కాల్చడంతో పొగ కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా MLA వీర్లపల్లి శంకర్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలుష్యాన్ని నియంత్రించకుండా అగచాట్లకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు.