WGL: జిల్లా కేంద్రంలోని పెరుకవాడలో ఇవాళ AIFDS నాయకులు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మనుస్మృతి పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా AIFDS జిల్లా కార్యదర్శి చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ.. 1927లో అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేశారని, 98 ఏళ్ల తర్వాత కూడా RSS-BJP ప్రభుత్వం మనువాద అజెండాను అమలు చేస్తోందని విమర్శించారు.