కడప: పేద బలహీన వర్గాలకు అండగా నిలబడ్డ మహోన్నతమైన వ్యక్తి, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్ పేయ్ అని కడప జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్ తెలిపారు. గురువారం సిద్ధవటంలో మండల అధ్యక్షులు సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వాజ్ పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.