BHPL: రేగొండ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇవాళ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయీ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపయ్య మాట్లాడుతూ.. వాజ్పేయీ రాజకీయ విలువలకు ప్రతీక అని, ఆధునిక భారతానికి పునాదులు వేశారని, పోఖ్రాన్ పరీక్షలతో భారత శక్తి చాటారని కొనియాడారు.