NLG: చండూరు(M) పుల్లెంల గ్రామానికి చెందిన పాక హనుమంతు అలియాస్ గణేశ్ ఒడిశా ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. మావోయిస్టు కేంద్ర కమిటీలో 40 ఏళ్లుగా కీలక సభ్యుడిగా గణేశ్ ఉన్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగా కొద్ది కాలానికే హతమయ్యారు. కాగా ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు.