W.G: లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినం క్రిస్మస్ అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. ఇవాళ నియోజకవర్గ ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ శాంతి, ప్రేమలకు చిహ్నమని, దైవానికి మనిషికి మధ్య బంధాన్ని బలపరుస్తుందని అన్నారు. కోట్లాది మంది జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.