BDK: దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో ఎస్సై సాయి కిషోర్ రెడ్డి ఇవాళ పేకాట స్థావరాలపై దాడి నిర్వహించారు. పేకాట రాయుళ్ల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 4,900 నగదు పట్టుకున్నట్లు తెలిపారు. ముగ్గురు పేకాట రైళ్ళను అదుపులోకి తీసుకున్నట్లు మరో ముగ్గురు పరారైనట్లు వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.