KMM: పదవి అంటే అధికారం కాదు.. బాధ్యత అని కొణిజర్ల మండలం తీగలబంజర నూతన సర్పంచ్ నూనావత్ శ్రీను నిరూపించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా ఆయన వినూత్నంగా తన బాధ్యతలు ప్రారంభించారు. గురువారం ఆయన స్వయంగా పంచాయతీ ట్రాక్టర్ను నడుపుతూ వీధుల వెంబడి తిరుగుతూ చెత్తను సేకరించారు.