BDK: క్రిస్మస్ పండుగ సర్వలోక వేడుక అనీ, జ్ఞానులకు, సామాన్యులకు సమన్యాయం జరుగుతుందని DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం పాల్వంచ మండలం పరిధిలోని నాగారం కాలనీలో జరిపిన క్రిస్మస్ వేడుకల్లో కొత్వాల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం పాస్టర్ గద్దల విజయ్ ఆయన్ని సన్మానించారు.