NRPT: బాలానగర్ మండలం పెద్దాయపల్లి చౌరస్తా సమీపంలో నారాయణపేట జిల్లా మరికల్ స్కూల్ బస్సు అదుపుతప్పి కింద పడ్డ సంఘటన తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డి. జానకి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానిక ఎస్సై లెనిన్ ప్రమాద సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.