ADB: నార్నూర్ మండలాభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసేందుకు తమ వంతు కృషి చేయాలనీ సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ అన్నారు. ఆయన గురువారం ఆదిలాబాద్ పట్టణంలో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సమస్యలపై విస్తృతంగా చర్చించారు.