SKLM: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విలువల రాజకీయానికి ప్రతిరూపంగా నిలిచిన నేత స్వర్గీయ డోల సీతారాములు అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఇవాళ పోలాకి మండల కేంద్రంలో జరిగిన ఆయన జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన రాజకీయాల్లో మచ్చలేని నాయకత్వానికి ప్రతీకగా నిలిచారని అన్నారు.