PDPL: అంతర్గాం మండలం ఆకనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్ పనులకు నూతన సర్పంచ్ గాదె స్రవంతి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సహకారంతో తన సాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. తనకు సర్పంచ్‌గా అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు.