MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని స్థానిక చర్చిలో ఇవాళ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా MLA డా భూక్యా మురళి నాయక్ హాజరై, మాట్లాడుతూ.. క్రిస్మస్ పర్వదినం ప్రేమ, సోదరభావం, శాంతి సందేశాన్ని అందరికీ గుర్తుచేస్తుందని, అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో, పరస్పర గౌరవంతో జీవించాలన్నదే ఈ పండుగ సారాంశమని పేర్కొన్నారు.