NDL: చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) నంద్యాల డయాసిస్ పరిధిలోని హోలీ క్రాస్ కేథడ్రల్ హోలీ క్రాస్ సెంటెనరీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ హాజరయ్యారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే మంత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.