JGL: కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలోని పదో వార్డులో ప్రజలకు నీటి సమస్య తీర్చాలని బోరు బావి ఏర్పాటు చేశారు. సర్పంచ్ నాగం భూమయ్య టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బోర్ బావి ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోకతోట లింబాద్రి, వార్డు సభ్యుడు బోదాసు అంజయ్య పాల్గొన్నారు.