AP: భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు పడింది. పేకాట, సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీకి లేఖ రాశారు. విచారణ సాగుతుండగానే ఆయన్ను బదిలీ చేసి, రఘువీర్ విష్ణును కొత్త డీఎస్పీగా నియమించారు. ట్విస్ట్ ఏంటంటే.. జయసూర్య మంచి ఆఫీసర్ అని, గోదావరి జిల్లాల్లో పేకాట కామన్ అని రఘురామకృష్ణరాజు సపోర్ట్ చేయడం చర్చనీయాంశమైంది.