HYD: గ్రేటర్ పరిధిలో మెడికల్ షాపుల మాఫీయా నడుస్తోంది. సరైన వైద్యుల చీటీ లేకుండానే మందులను విక్రయిస్తున్నారు. వీటిల్లో నిషేధిత మందులు కూడా ఉండడం గమనార్హం. ప్రతి మెడికల్ షాపులో ఫార్మసిస్టు ఉండడం లేదు. ఇటీవల చేసిన ఆకస్మిక తనిఖీల్లో 439 షాపులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడమే దీనికి నిదర్శనం. అయినా షాపు యజమానులు వెనుకడుగు వేయడం లేదు. దందాను కొనసాగిస్తూనే ఉన్నారు.