ఆలమూరు మండలంలో పలు రహదారుల మరమ్మతులకు రూ.1.10 కోట్ల ఆర్అండ్బీ నిధులు మంజూరు అయ్యాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. జొన్నాడ నుంచి మండపేట ప్రధాన రహదారికి సంబంధించి కొత్తూరు సెంటర్ నుంచి గుమ్మిలేరు వరకూ మరమ్మతుల నిమిత్తం రూ.80 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. మిగతా రహదారుల పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.