KNR: మానవత్వమే పరమావధిగా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామ పంచాయతీ అభినందనీయ నిర్ణయం తీసుకుంది. గ్రామంలో ఎవరు మరణించినా వారి అంత్యక్రియలను పంచాయతీ పక్షాన ఉచితంగా నిర్వహించాలని పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇందులో భాగంగా గ్రామంలో మృతి చెందిన లంక భూదమ్మ అనే వృద్ధురాలి అంత్యక్రియలను జీపీ పక్షాన నిర్వహించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.