కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ శివారు రామానగరంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. తోటవారి బజార్లో బడ్డీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వెలగం అనురాధకు చెందిన తాటాకు ఇంట్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. స్థానికులు, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ప్రమాదంలో సర్వం కాలిపోవడంతో అనురాధ ఆమె ఇద్దరు ఆడ పిల్లలు కట్టుబట్టలతో నిలిచారు. ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.