NTR: పెనుగంచిప్రోలు మండలానికి చాలా ఏళ్ల తర్వాత కొత్త 108 అంబులెన్స్‌ని ప్రభుత్వం అందించింది. మండలానికి చెందిన వాహనం పాతది కావడంతో కొన్నాళ్లుగా సిబ్బంది నిర్వహణకు ఇబ్బంది పడ్డారు. ఇటీవల మండలానికి అంబులెన్స్ కేటాయించడంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వాహనంతో ప్రమాద సంఘటనకు సత్వరమే చేరుకునేందుకు అవకాశం ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు.