CTR: చిత్తూరు నియోజకవర్గంలో క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న అందరికీ MLA గురజాల జగన్మోహన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నగరంలోని పలు చర్చిల్లో జరిగిన ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు.