VSP: క్రిస్మస్ సందర్భంగా పెందుర్తి పెంతుకోస్తు చర్చిలో గురువారం జరిగిన వేడుకల్లో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రేమ, దయ, క్షమాగుణానికి ఆదర్శమని తెలిపారు. ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పేదలకు సాయం చేస్తూ నగర అభివృద్ధికి అందరూ కలిసి పని చేయాలని కోరారు.