టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలి ఐదుగురు మృతి చెందారు. పర్వతంపై ఉన్నవారిని వైద్యచికిత్స కోసం తరలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు టాంజానియా పౌర విమానయానశాఖ వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులతో పాటు డాక్టర్, టూరిస్ట్ గైడ్, పైలట్ ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు పేర్కొంది.